ఈ నెల 23 నుండి జనవరి 1వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి

తిరుమల (CLiC2NEWS): శ్రీవారి భక్తులకు డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టిటిడి తెలిపెంది. దీనికి సంబంధించి తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో ఈ నెల 22 నుండి 4,23,500 టోకెన్లు ఇవ్వనున్నట్లు ఆలయ ఇఒ ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లి, జీవకోనలోని జెడ్‌పి ఉన్నత పాఠశాలలు.. తిరుమలలోని స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృమం వద్ద ఈ టోకెన్లను ఇస్తారు. టోకెన్లు ఉన్నభక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.