క‌ల్యాణ‌మ‌స్తు, షాదీ తోఫా సాయం నేరుగా పెళ్లి కుమార్తె త‌ల్లి ఖాతాలో జ‌మ‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న క‌ల్యాణ‌మ‌స్తు, షాదీ తోఫా ప‌థ‌కాల ద్వారా అందించే సాయం ఇక‌నుండి నేరుగా పెళ్లి కుమార్తె త‌ల్లి ఖాతాలో జ‌మ‌చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి కుమార్తె అకౌంట్‌లో జ‌మ చేశారు. గ‌త ఏడాది అక్టో బ‌ర్ నుండి డిసెంబ‌ర్ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాద ఫిబ్ర‌వ‌రి నెల‌లో అంద‌జేశారు. అయితే తాజాగా ప్ర‌భుత్వం పెళ్లి కుమార్తె తల్లి ఖాతాల్లో జ‌మ చేయాల‌ని నిర్ణ‌యించింది. వివిధ వ‌ర్గాల నుండి వ‌చ్చిన విన‌తుల మేర‌క ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఒక వేళ త‌ల్లి లేక పోతే పెళ్లి కుమార్తె అనుమ‌తితో ఆమె తండ్రి లేదా అన్నద‌మ్ములు లేదా ఆమెకు సంర‌క్ష‌కుడిగా ఉన్న వారికి అంద‌జేయ‌నున్నట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.