పెళ్లి బృందం బస్సును ఢీకోన్న మరో బస్సు..

భువనేశ్వర్ (CLiC2NEWS): పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును.. ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢోకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. బ్రహ్మపుర – తప్తపాణి రోడ్డులో రెండు బస్సులు ఢీకోని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివాహానంతరం పెళ్లి వారందరూ పెళ్లి కుమార్తెను అత్తవారింట్లో దింపి.. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఎంకెసిజి వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దాగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మరణించిన కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు. స్పెషల్ రిలీఫ్ కమిషన్.. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించింది.