హైదరాబాద్‌లో గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): వర్షం కారణంగా పాత గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. మరణించిన వారు బిహార్ వాసులుగా గుర్తించారు. చిన్నారులు ఇంటిముందు ఆడుకుంటుండగా గోడ కూలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం.