చిన్నారుల మృతికి పానీపూరీ కారణమా?

జంగారెడ్డిగూడెం (CLiC2NEWS): ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బేలిపాటి రవి, చిన జమ్మక్కకు ముగ్గురు కుమారులు. రామకృష్ణ, విజయ్‌లు. చిన్నారులు ఇద్దరు బుధవారం రాత్రి పానీ పూరి తిని ఇంటికి రాగా.. వారికి ఆర్ధరాత్రి కడుపు నొప్పి , వాంతులయ్యాయి. దీంతో చిన్నారులిద్దరినీ హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం రామకృష్ణను రాజమహేంద్రవరం.. విజయ్‌ను ఏలూరు తరలిస్తుండగా వారు మృతి చెందారు. పానీ పూరి తిని తమ పిల్లలు మృతి చెందారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరి మరో కుమారుడు కిందట ఒకరు అనారోగ్యంతో చనిపోయారు.