మయన్మార్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదు

బ్యాంకాక్ (CLiC2NEWS): మయన్మార్, బ్యాంకాక్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. మయన్మార్‌లో 12 నిమిషాల వ్యవధిలో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ప్రకంపలను కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యయి. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కూప్పకూలినట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం చోటుచేసుకుంది. అత్యధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండు సార్లు తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4, 7.3గా నమోదౌంది. మయన్మార్, థాయ్‌లాండ్ సహా భారత్, చైనా , వియత్నాం, తూర్పు ఆసియా దేశాల్లో 7.7, 6.4 తీవ్రతతో రెండు భూకంపాలొచ్చాయి.
భూకంపం కారణంగా బ్యాంకాక్‌లో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. నగరంలోని 30 అంతస్తుల భారీ భవనం కూప్పకూలిపోగా.. దీనిలో 43 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం.
మయన్మార్‌లోని నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలోని ఐకానిక్ వంతెన, ఆలయాలు సహా కుప్పకూలాయి. థాయ్‌లాండ్‌లో పలు భవనాలు నేలకూలాయి. బ్యాంకాక్‌లో మెట్రో , రైలు సేవలు నిలిపివేశారు. ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.