గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన పోలీసులు..

హైదరాబాద్ (CLiC2NEWS): గంజాయి సరఫరా చేస్తూ ఎపికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. నర్సీ పట్నం నుండి నగరంలోని బాచుపల్లికి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు సెలవు పెట్టి మరీ గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం. బాలానగర్ ఎస్ఒటి పోలీసులు నిందితుల వద్ద నుండి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.