తెలంగాణకు 2 రోజుల వర్ష సూచన
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల రానున్న రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదారబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. పలు జిల్లాల్లో తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 30 నుంచి 40 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర ఒక ప్రకటనలో పేర్కొంది.
రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతుందని సంచాలకులు వెల్లడించారు.