హైదరాబాద్ శివారులో జంట మృతదేహాలు..
రంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి సమీపంలో రెండు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలోని కంపచెట్ల మధ్య రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ లభ్యమైన వివరాల ఆధారంగా మృతులు వారాసిగూడకు చెందని ఎడ్ల యశ్వంత్, జ్యోతిగా పోలీసులు గుర్తించారు.
యశ్వంత్ అదృశ్యంపై చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అతని సోదరుడు అనిరుధ్ తెలిపాడు. జ్యోతి ఎవరో తమకు తెలియదని, ఎవరూ శత్రువులు కూడా లేరని పోలీసులకు వివరించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డిసిపి సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నట్లు చెప్పారు. జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.