ఈ నెల 9 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
9 న రెండు గ్యారెంటీలు అమలు..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తొలి కాబినేట్ మీటింగ్ నిర్వహించింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ఆరు గ్యారెంటీల అమలు గురించి చర్చించినట్లు సమాచారం. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆరుగ్యారెంటీలలో ముందుగా రెండు గ్యారెంటీలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలియజేశారు. వాటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షల వరకు పెంపు. ఈ రెండు గ్యారెంటీలను డిసెంబర్ 9 న అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలియజేశారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా సాగుకు 24 గంటల కరెంటు ఇవ్వాలని అధికారులను ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 9వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ప్రొటెం స్పీకర్ నియామకం తర్వాత స్పీకర్ ఎన్నకి, గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలిపారు.