విశాఖ జిల్లాలో రెండు లక్షల కేజీల గంజాయి దహనం
విశాఖపట్నం (CLiC2NEWS): అపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని దహనం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తరలిస్తున్న 2లక్షల కిలోల గంజాయిని పోలీసులు సీజ్ పట్టుకున్నారు. పట్టుబడిన కోట్ల విలువ చేసే ఈ పొడి గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. గంజాయి సరఫరా నియంత్రణే లక్ష్యంగా ఎపి అంతగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ గంజాయిన ధ్వంసం చేయలేదన్నారు. గిరిజనులలో మార్పు వచ్చిందని , గంజాయి సాగు, రవాణా వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించి దీనికి దూరంగా ఉంటున్నారన్నారు. ఏజెన్సీలలో గంజాయి సాగును అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డిజిపి వెల్లడించారు.