ఖమ్మం: పాదచారులపైకి దూసుకొచ్చిన కారు.. తల్లీ కుమారుడు దుర్మరణం..

రఘునాథపాలెం (CLiC2NEWS): ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి తల్లీ కుమారుడు దుర్మరణం పాలైయ్యారు. రోడ్డు ప్రక్కన తాటి ముంజులు కొంటున్న వారిపైకి కారు దూసుకొచ్చి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుదంపాడు వద్ద కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారేపల్లికి మండలం జాస్తినపల్లికి చెందిన శారద, ఆమె కుమారడు కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన తండ్రిని ఆస్పత్రిలో చేర్చి కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం.