కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదు
తిరువనంతరపురం (CLiC2NEWS): కేరళలో మంకీపాక్స్ వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. యుఎఇ నుండి వచ్చిన ఇద్దరికి వైరస్ పాజిటివ్ గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వయనాడ్, కన్నూర్ జిల్లా కు చెందిన ఇద్దరి వ్యక్తులకు మంకీపాక్స్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అప్రమత్తమైన అధికారులు బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.