TS: మ‌రో రెండు రోజులు భారీ వ‌ర్షాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉప‌రిత ద్రోణి ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ వ‌ర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు దంచికొడుతున్నాయి. శుక్ర‌వారం ఉద‌యం నుంచి ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి. ఈ వాన‌లు మరో రెండు రోజుల పాటు కురిసే అవ‌కాశ‌ముంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది. ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరిక‌లు జారీచేసింది. ఉప‌రిత ద్రోణి ప్ర‌భావంతో మ‌ళ్లీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మెద‌క్‌, రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖ‌మ్మం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురియ‌నున్నాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.