AP: ఆగిరిపల్లి వద్ద అదుపుతప్పి బావిలో పడిన బైక్: ఇద్దరు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/11/accident.jpg)
ఏలూరు (CLiC2NEWS): న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆగిరిపల్లి మండలం కకనానపల్లి గ్రామ శివారులో బైక్ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గరు యువకులు డిసెంబర్ 31 వేడుకలు ముగిసిన తర్వాత ద్విచక్రవాహనంపై వెళుతుండగా అదుపుతప్పి బైక్‌తో సహా బావిలో పడిపోయారు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.