రోడ్డుపై వెళుతున్న కారులో మంటలు.. ఇద్దరు సజీవదహనం
ఘట్‌కేసర్ (CLiC2NEWS): ఘట్‌కేసర్ పిఎస్ పరిధిలో ఘన్‌పూర్ సర్వీస్ రోడ్డులో వెళుతున్న కారులో మంటలు వ్యాపించి ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఇది ప్రమాదవ శాత్తు జరిగినది కాదని.. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పెద్దలు అంగీకరించలేదని.. ప్రేమజంట సోమవారం సాయంత్రం కారులో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు వారిరువురు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 3 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను శ్రీరామ్, లిఖితగా గుర్తించారు. శ్రీరామ్.. యాదాద్రి జిల్లా బిబినగర్ మండలం జమ్ములపేట, యువతిది మేడ్చల్ జిల్లాకి చెందినవారిగా గుర్తించారు.