కేసు వెనక్కి తీసుకోలేదని.. యువతిని కిరాతకంగా చంపి..!

ఢిల్లీ (CLiC2NEWS): అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు బెయిల్‌పై బయటకువచ్చి.. బాధితురాలిని కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణతో పవన్ నిషద్ జైలుకెళ్లాడు. కేసును వెనక్కి తీసుకోవాలని నిషద్ సోదరులు బాధితురాలి కుటుంబాన్ని వేధిస్తున్నారు. వేరే కేసులో శిక్షను అనుభవిస్తున్న అశోక్ నిషద్.. పవన్ ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అత్యాచార కేసును వెనక్కి తీసుకోవాలని బాదితురాలి కుటుంబంతో మరోసారి మాట్లాడగా.. వారు ససేమిరా అనడంతో ఘర్షణ వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇంటికి వస్తున్న యువతిని గొడ్డలితో నరికి చంపి పరారయినట్లు పోలీసులు తెలిపారు.