రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం!

సూర్యాపేట (CLiC2NEWS): సూర్యాపేజ జిల్లా చివ్వెలంల మండల గుంపుల గ్రామం దగ్గర హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఎసిఎస్ ఆర్టీసీకి చెందిన 2 బస్సులకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు ఆర్టీసీ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లున్న బస్సులో బ్యాటరీ సమస్య తలెత్తడంతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులను వేరే బస్సుల్లో పంపించారు.
తరువాత సర్యాపేట నుంచి ఎసిఎస్ ఆర్టీసీ కి చెందిన మరో బస్సు రప్పించి వైర్ల సాయంతో రెండు బస్సుల మద్య బాటరీ సమస్యను రిపేరు చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో భారీ శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. ఈ మంటలే మరో బస్సుకూ వ్యాపించాయి. ఈ ప్రమాదం లో రెండు బస్సులు దగ్ధమయ్యాయి.