అతి వేగంతో దూసుకొచ్చిన కారు.. ఇద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగినులు దుర్మరణం

చెన్నై (CLiC2NEWS): చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఇద్దరు మహిళా ఉద్యోగినులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెకీలు దుర్మరణం చెందారు. ఆఫీస్‌లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అతి వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోక యువతి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. మరణించిన వారు తిరుపతికి చెందిన ఎస్. లావణ్య, కేరళలోని పాలక్కడ్‌కు చెందిన ఆర్. శ్రీలక్ష్మీగా గుర్తించారు. వీరిరువురు హెచ్‌సిఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్‌లో ఎనలిస్ట్‌లుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఉందని పోలీసులు వెల్లడించారు.
Hello! I’ve been following your weblog for a long time now and finally got the courage to go ahead and give you a shout out from
Austin Tx! Just wanted to say keep up the fantastic job!