స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

University of Dundee: సరదాగా స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవ శాత్తు నీట మునిగి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్కాట్లాండ్‌లో చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26) , చాణక్య బొలిశెట్టి (22) ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్ వెళ్లారు. వీరు స్కాట్‌లాండ్‌లోని డూండి యూనివర్సిటిలో మాస్టర్స్ చదువుతున్నారు. మరికొంత మంది భారత స్నేహితులతో కలిసి పెర్త్‌షైర్‌లోని లిన్ ఆఫ్ తమ్మెల్‌కి వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా.. ప్రమదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయినట్లు సమాచారం. జితేంద్రనాథ్ అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటిలో చదివారు. చాణక్య 2022లో హైదరాబాద్ జెఎన్‌టియు వర్సిటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై డూండి యూనివర్సిటి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా.. ఘటనా స్థలానికి కొంత దూరంలో మృతదేహాలను గుర్తించారు. లండన్‌లోని భారత హైకమిషనర్ అధికారి స్పదించి మృతు కుటుంబాలకు సమాచారం అందిచినట్లు తెలిపారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపించనున్నట్లు సమాచారం.