బెంగాల్‌లో రెండు రైళ్లు ఢీ..

కోల్‌క‌తా (CLiC2NEWS): ప‌శ్చిమ బెంగాల్‌లోని బంకు రా జిల్లాలో మెయింటెనెన్స్ రైలును గూడ్సు రైలు డీ కొంది. అడ్రా డివిజ‌న్ ప‌రిధిలోని ఓండా రైల్వే స్టేష‌న్‌కు స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం తెల్ల‌వారు జామున 4 గంట‌ల ప్రాంతంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 12 వ్యాగ‌న్లు ప‌ట్టాలు త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది. బ‌లంగా ఢీ కొన‌డంతో గూడ్సు రైలు ఇంజ‌న్‌మ‌రో వ్యాగ‌న్‌పైకి చేరింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక డ్రైవ‌ర్‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదంతో ఆ మార్గంలో రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. 14 రైళ్ల‌ను ఈ రోజు ర‌ద్దు చేసిన‌ట్లు రైల్వేశాఖ ప్ర‌క‌టించింది. మ‌రికొన్ని తాత్కాలికంగా ర‌ద్దు చేశారు. ఈ వివ‌రాలు ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. రైల్వే సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ట్రాక్ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.