ఔటర్ పై డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మహిళలు మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగర శివార్లలోని కీసర మండలంలోని యాద్దార్‌పల్లి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. విశయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.