AP : 8వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు
గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
TWREIS : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (ఎస్ ఒఇ/ సివిఇ) లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష మార్చి 9న నిర్వహించనున్నారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశ పరీక్షకు అర్హులు. ఈ రెండింటికీ విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్షకు మించరాదు.
మొత్తం సీట్లు ఇంటర్ ఎంపిసి – 300, ఇంటర్ బైపిసి- 300, 8వ తరగతి – 180.
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపించేందుకు చివరి తేదీ మార్చి 2.
ప్రవేశ పరీక్ష వచ్చేనెల 9వ తేదీన నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులను మార్చి 4 వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెరిట్ జాబితాను మార్చి 25వ తేదీన వెల్లడిస్తారు. మొదటి దశ కౌన్సెలింగ్ ఏప్రిల్ 11వ తేదీన.. రెండో దశ కౌన్సెలింగ్ ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://twreiscet.apcfss.in/ వెబ్‌సైట్ చూడగలరు.
గురుకులాల వివరాలు:
కాలేజ్ ఆప్ ఎక్సలెన్స్, (పిజిటి) మల్లి
కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, తనకల్లు
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాఖపట్నం
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, విస్సన్న పేట
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, పార్వతీపురం (జోగింపేట)
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రీశైలం డ్యామ్
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రీకాళహస్తి