ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటి సిఎం బాధ్యతలు..

చెన్నై (CLiC2NEWS): తమిళనాడు రాష్ట్రంలో ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తనయుడు, ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటి సిఎం బాధ్యతలు అప్పగించేందుకు మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది. రేపు మధ్యాహ్నం ఉదయనిధి ప్రమాణస్వీకారం చేయనున్నారు.