ఉగాది ప‌చ్చ‌డిలో.. అద్భుత ఔష‌ధ‌ గుణాలు!

ఉగాది పచ్చడి గురించి చెప్పుకుందాం…

భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉగాది ని చేసుకుంటారు. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న మన భారతీయులతో పాటు విదేశీయులు కూడా మనతో ఉగాది పండుగ చేసుకుంటున్నారు. కొంత మంది దేవి నవరాత్రులు ఉత్సవాలు ఈ రోజు నుండే ప్రారంభిస్తుంటారు.

ఋతువులతో కూడిన తొలి దినమే ఉగాది. కొన్ని ప్రాంతాలలో ఇంటికి పంట చేరుకుంటుంది. జేబు నిండా, చేతులలో డబ్బులు గలగల అంటూ చేతి నిండా డబ్బులు వుంటాయి. భలే ఖుషీగా, ఆనందంగా, హుషారుగా వుంటారు. పండుగ రోజు తెల్లవారుజామున లేచి, చక్కగా తల స్నానాలు చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని. ఇళ్లకు మామిడి పచ్చని తోరణాలు కట్టి, మొత్తకు, సింహ ద్వారానికి పసుపు పెట్టి, ఇళ్లను చక్కగా అలంకరించుకొవటం హిందు సాంప్రదాయం, సంస్కృతికి, చాలా మంచి ఆచారం. ఇంటిని చక్కగా చేసుకున్న తరువాత ఇలవేల్పులను పూజించటం, ధూప దీప నైవేద్యాలను సమర్పించుకొని తరువాత క్రొత్త కుండలో కొత్త చింతపండు, వేపపూవు, బెల్లం, మామిడి ముక్కలు, అరటిపండు, చేరుకు ముక్కలు, చిటికెడు ఉప్పు, మొదలగున్నవి కలిపి ఉగాది పచ్చడి చేసి దేవుడికి అర్పించి తరువాత కుటుంబం అందరూ కలిసి ఆనందంగా ఆ రసాన్ని అస్వాదిస్తారు. ఉగాది పచ్చడి ఎంతో చెప్పలేని రుచిగా ఉంటుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. రాబోయే రోజులలో శరీరానికి, మానసికంగా జబ్బులు రాకుండా ఈ పచ్చడిలో ఉన్న ఆరు రుచులతో ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని అందించటంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తుంది. ఉగాది పచ్చడిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

ఇందులో మధుర, ఆమ్లా, లవణ, ఆరు రసములు సమపాళ్లలో కలిసి ఉంటాయి. ఈ పానకం వలన మసనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. నోటిలో లాలాజలం ఊరిస్తుంది. కష్టాలు, సుఖాలు, సనంగా భరించాలంటూ తెలియచేస్తుంది. అన్ని రోజులు ఆనందంగా వుండవు, అన్ని రోజులు కష్టాలు కూడా ఉండవు. అన్నిటినీ ఆహ్వానిస్తూ జీవితం గడపటమే. అలాంటి వాటిని తట్టుకోవడానికి ముందు పులుపు, తీపి, కారం, మధురం, చేదు, వగరు కలిపి తయారుచేసే తినే పచ్చడి ఉగాది పచ్చడి అంటారు.


వేప పూవు

వేపచెట్టును, నింబా సంస్కృతంలో అంటారు. వేపాలో అనేక ఔషధ గుణాలున్నాయి. దీనిలో నింబిన్, నింబిడిన్, నింబినిన్ టానిన్, అనే కెమినల్స్ వున్నాయి. వేప యాంటీ బాక్టీరియలు, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉన్నాయి. చర్మ వ్యాధులలో చక్కగా పనిచేస్తుంది. పెనుకోరుకుడికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఇది తిక్త కాషాయ రసం లఘు గుణం, కలిగి ఉంది. ఇది కఫపిత్తములను శమింపచేస్తుంది. అగ్నిదీప్తిని కలిగిస్తుంది. అనేక జబ్బులకు 100 రకాల జబ్బులకు తగ్గించే గుణం దీనికి ఉంది. వేప పూవు తినగా తినగా తియ్యగా నుండును. అదే విధంగా జబ్బులన్ని తగ్గును.

షుగర్ పేషెంట్స్ కి రామబాణం లాంటిది. కామెర్లు, పుండ్లు, గజ్జి, తామర, మొటిమలు, చుండ్రు, తగ్గిస్తుంది. కడుపులోకి తింటే నులి పురుగులు కిక్కున సచ్చి బయటికి వస్తాయి.


మామిడి

పులుపు, తీపి, కలిసి వుండే మామిడి కాయాలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది కఫపిత్తనాశకం, వాతహరం, గుండె జబ్బులు, మధుమేహం, లాంటి జబ్బులను తగ్గుస్తుంది. నరాల బలహీనతను పోగొడుతుంది. కడుపు నొప్పి తగ్గిస్తుంది. వడ దెబ్బ నుండి రక్షిస్తుంది.విటమిన్ C వుంటుడుట వలన ఆరోగ్య ముగా ఉండటానికి చక్కగా పనిచేస్తుంది.


బెల్లం

ఇది బెల్లం లొ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చక్కని శక్తినిస్తుంది. అనేక పోషక విలువలు ఉంటాయి. protiens లోపాన్ని బెల్లం తొలిగిస్తుంది.

 

చింతపండు

దీనిని చించా అని సంస్కృతలో అంటారు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఉంటాయి. పైత్య వికారాలను తొలిగిస్తుంది. జ్వరాలు తగ్గిస్తుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. వాతవ్యాధులు తగ్గిస్తుంది.


అరటిపండు

ఇంటి వెనకు అరటిపండు చెట్టు, మన ఇంటిలో ఉన్న వారి జబ్బులను పోగొడుతుంది. మన వంటిలో ఉన్న విజాతీయ పదార్దాలను విసర్జించేటట్లు చేస్తుంది. దీనిలో ఆరోగ్యపోషణలో అరటి పండు చాలా విలువైనది. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇది కూడా యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంది. విరోచనాలు తగ్గిస్తాయి. అధిక రక్తపోటు ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, గౌట్, కిడ్నీ, రోగాలు తగ్గిస్తుంది. ఆంత్ర వ్రణాలు తగ్గిస్తుంది.


ఉప్పు

ఉప్పు లేని పప్పు కూడు హ్హ్, అని పాట ఉంది తెలిసే ఉంటుంది. ఉప్పు లేకపోతే అది కూర వ్యర్ధంతో సమానం. నాలుకకు రుచి తగలదు, ఉప్పు సరిగా శరీరానికి అందకపోతే చమట రాదు. చమట రాకపోతే చర్మ వ్యాధులు వస్తాయి. అధికంగా తీసుకుంటే బీపీ వస్తుంది. ఉగాది పచ్చడిలో ఉప్పు చాలా అవసరం చిటికెడు ఉప్పు వేస్తే పచ్చడి రుచే వేరు, సూపర్ గా ఉంటుంది. నోటిలో లాలాజలం ఊరుతుంది. శరీరానికి పుష్టిగా ఉంచడానికి, బలాన్ని ఇవ్వటానికి, ఎండలో తిరిగి వచ్చే వారికి మజ్జిగ లో చిటికెడు ఉప్పు వేసి ఇస్తే తక్షణమే శరీరానికి బలం చేకూరుతుంది. ఎండ దెబ్బ నుండి రక్షణ కలిగిస్తుంది. అందుకే పచ్చడిలో వేస్తే రుచికి బాగుంటుంది.


చెరుకు

చెరుకు రసం ఎండ తీవ్రత నుండి కాపాడుతుంది. సత్వర శక్తినిస్తుంది. దీనిని తాగటం వలన దాహం తిరుతుంది. మూత్రం సాఫీగా వస్తుంది. ఇందులో సుక్రోజ్ ఉంటుంది. చేరుకురసం ఎండాకాలంలో తాగటం వలన డిహైడ్రాషన్ నుండి రక్షణ పొందవచ్చును.

.. ఆరు రకాల రుచులతో కలిపి చేసే పచ్చడి ఉగాది పచ్చడి అంటారు.ఈ పచ్చడి,శారీరక,మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ,అందరి నోటిలో లాలజం ఊరిస్తూ,పండుగను చక్కగా అయ్యేటట్లు చూస్తుంది.ఉగాది పానీయం సకల రోగాలకు చక్కని ఔషధం.

 

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.