UGC: ఆ కోర్సుల‌కు ఆడ్మిష‌న్స్ ఆపేయండి

ఢిల్లీ (CLiC2NEWS):  ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెష‌న్స్ యాక్ట్, 2021 కింద వ‌చ్చే కోర్సుల‌కు అడ్మిష‌న్లు నిలిపివేయాల‌ని ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు యుజిసి ఆదేశాలు జారీ చేసింది. సైకాల‌జి, మైక్రోబ‌యాల‌జి, ఫుడ్ అండ్ న్యూట్రిషియ‌న్ సైన్స్‌, బ‌యో టెక్నాల‌జి, క్లినిక‌ల్ న్యూట్రిష‌న్‌, డైటెటిక్స్ స‌హా ఆరోగ్య సంర‌క్ష‌ణ కోర్సుల‌న్నింటిపై నిషేధం విధించిన‌ట్లు యుజిసి వెల్ల‌డించింది. ఈ కోర్సుల‌ను కాలేజీలు, యూనివ‌ర్సిటీలు ఓపెన్‌, ఆన్‌లైన్ , డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బోధించ‌డం నిలిపివేయాల‌ని ఆదేశించింది. 24వ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ బ్యూరో వ‌ర్కింగ్ గ్రూప్ సిఫార్సుల మేర‌కు జులై 23న జ‌రిగిన యుజిసి స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. దీనిపై తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జులై-ఆగ‌స్టు 2025 విద్యా సంవ‌త్స‌రం నుండి ఈ కోర్సుల‌పై నిషేధం వ‌ర్తింస్తుంద‌ని యుజిసి పేర్కొంది.

Also Read: ప్రైవేటు సంస్థ‌ల్లో చేరే ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం నుండి నెల‌కు రూ.15 వేలు!

1 Comment
Leave A Reply

Your email address will not be published.