హైకోర్టు సిజెగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టు 5వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సిజెగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబరు 17న గుహవాటి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2019 అక్టోబరు 3న బాంబే హైకోర్టుకు బదలీ అయ్యారు. 2021 అక్టోబరు 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు.