ర‌ష్యా దాడుల‌లో 79 మంది చిన్నారుల మృత్యువాత: ఉక్రెయిన్ వెల్ల‌డి

కీవ్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రాష్యా దాడుల‌తో ఉక్రెయిన్‌ పౌరులు అధికంగా మ‌ర‌ణిస్తున్నారు. వీరిలో చిన్నారులు 79 మంది మృతిచెందార‌ని ఉక్రెయిన్ అధికారులు వెల్ల‌డించారు. ఈ ప‌సిబిడ్డ‌ల మృతిపై ఇటీవ‌ల ఆదేశ ప్ర‌థ‌మ పౌరురాలు వొలెనా జెలెన్ స్కా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఉక్రెయిన్‌లోని నివాస ప్రాంతాలు, పాఠ‌శాల‌లు, హాస్పిట‌ల్స్ కూడా ధ్వంసం అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 202 పాఠ‌శాల‌లు, 34 ఆసుప‌త్రులు, 1500 నివాస భ‌వ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.