ఎపి చరిత్రలో మర్చిపోలేని రోజు: నితిన్ గడ్కరీ
ఎపిలో 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన
విజయవాడ (CLiC2NEWS): కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఎపి సిఎం జగన్ మోహన్‌రెడ్డి 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్-2ను ఎపి ముఖ్యమంత్రి ,కేంద్ర మంత్రులు, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఇక్కడి అభివృద్ధిలో పోర్టులది కీలక పాత్రని అన్నారు. గ్రామాల అనుసంధానతకు వాజ్‌పేయీ అనేక చర్యలు తీసుకున్నరు. దేశాభివృద్ధికి గ్రమాల అనుసంధానం ఎంతో కీలకం అని వాజ్‌పేయీ భావించారన్నారు.
కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని , ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి రూ 3 లక్షల కోట్లను కేటాయిస్తామని అన్నారు. ఎపిలో 3 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తామని, 2024 లోగా రాయ్‌పూర్-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. నాగ్‌పూర్-విజయవాడ, బెంగళూర-చెన్నై మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తామన్నారు. రూ. 5వేల కోట్లతో చిత్తూరు-తంజావూరు ఎక్స్‌ప్రెస్ హైవేని పూర్తిచేస్తామని వెల్లడించారు.