Union Budget 2022: ఈ ఏడాది నుంచి డిజిట‌ల్ క‌రెన్సీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

న్యూడిల్లీ (CLiC2NEWS): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్ లోక్‌స‌భ‌లో వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సారి కూడా కాగిత‌ర‌హిత బ‌డ్జెట్‌ను ఆమె స‌మ‌ర్పించారు.
వ‌చ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బ‌డ్జెట్ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతార‌మ‌న్ అభివ‌ర్ణించారు. బ‌డ్జెట్ 2022-23 ను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశపెట్టిన అనంత‌రం ఆమె మాట్లాడుతూ..
మంత్రి లోక్‌స‌భ‌లో భారీ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఏడాదిలోనే దేశంలో డిజిట‌ల్ క‌రెన్సీ అందుబాటులోకి రానున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. డిజిట‌ల్ రూపీని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో బ్లాక్ చెయిన్‌, ఇత‌ర సాంకేతిక‌త‌ల‌ను ఉప‌యోగించి డిజిట‌ల్ రూపాయిని ఆర్‌బిఐ జారీ చేస్తుంద‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ఇది ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు లాభం చేకూరుస్తుంద‌ని వృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆర్ధిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. ఈ డిజిట‌ల్ క‌రెన్సీని సెంట్ర‌ల్ బ్యాంక్ లాంచ్ చేసి మేనేజ్ చేస్తుంద‌ని తెలిపారు. డిజిట‌ల్ క‌రెన్సీపై ఉన్న అపోహ‌ల‌ను తొల‌గిస్తూ కేంద్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: Budget 2022: 400 వందే భార‌త్ రైళ్లు..

Leave A Reply

Your email address will not be published.