Union Budget 2022: వ‌న్ క్లాస్‌.. వ‌న్ టివి ఛాన‌ల్‌

విద్యార్థుల కోసం డిజిట‌ల్ యునివ‌ర్సిటీ ఏర్పాటు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

న్యూడిల్లీ (CLiC2NEWS): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్ లోక్‌స‌భ‌లో వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సారి కూడా కాగిత‌ర‌హిత బ‌డ్జెట్‌ను ఆమె స‌మ‌ర్పించారు.
వ‌చ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బ‌డ్జెట్ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతార‌మ‌న్ అభివ‌ర్ణించారు. బ‌డ్జెట్ 2022-23 ను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశపెట్టిన అనంత‌రం ఆమె మాట్లాడుతూ..
క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా దేశంలో విద్యావ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్త‌మైంది. ముఖ్యుంగా గ్రామీణా ప్రాంతాల్లోని పిల్ల‌లు పాఠ‌శాల‌ల‌కు దూర‌మ‌వుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఈ బ‌డ్జెట్‌లో విద్యార్ంగంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి వెల్ల‌డించారు. దీనిలో భాగంగా విద్యార్థులంద‌రికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. దీనికోసం ప్ర‌త్యేకంగా డిజిట‌ల్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.
పిఎం ఈ-విద్య ద్వారా ప్ర‌సారం చేస్తున్న ఒక త‌ర‌గ‌తి – ఒక ఛాన‌ల్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌స్తుతం ఉన్న 12 నుండి 200 టీవీ ఛాన‌ళ్ల‌కు విస్త‌రిస్తామ‌ని ఆర్థిక మంత్రి తెలిఆరు. దీంతో అన్ని రాష్ట్రాలు 1 నుండి 12 త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రాంతీయ భాష‌ల‌లో అనుంబంధ విద్యాను అంద‌దించ‌డానికి ఇది వీలు క‌ల్పిస్తుంద‌ని తెలిపారు. ఇంట‌ర్నెట్‌, మొబైల్ ఫోన్‌, టీవీ, రేడియోల ద్వారా త‌ర‌గ‌తుల బోధ‌న ఉంటుంద‌ని తెలిపారు. ఇక ఉపాధ్యాయుల‌కు డిజిట‌ల్ నైపుణ్యాల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

డిజిట‌ల్ వ‌ర్సిటీ ఏర్పాటు
“విద్యార్థుల‌కు ఐఎస్‌టిఇ ప్ర‌మాణాల‌తో వ‌ర‌ల్డ్ లెవ‌ల్ విద్యను అందించేందుకు ప్ర‌త్యేకంగా డిజిట‌ల్ వ‌ర్సిటీ ని ఏర్పాటు చేయ‌నున్నాం. భార‌త దేశంలోని ప్ర‌తి విద్యార్థికి అందుబాటులో ఉండేలా,విద్యార్థికి అర్థం అయ్యేలా ప‌లు ప్రాంతీయ భాష‌ల్లో కోర్సుల‌ను ఈ యునివ‌ర్సిటీ అందించ‌నుంది. “ అని ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు.

అలాగే వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలలో సిల‌బ‌స్ మార్పులు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. జీరో బ‌డ్జెట్ సాగు, సేంద్రీయ సాగు, అదునాత వ్య‌వ‌సాయం, వాల్యూ అడిష‌న్ అండ్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల‌ను కొత్త‌గా చేర్చ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. సెల‌బ‌స్ మార్పుల కోసం ప్ర‌త్యేకంగా క‌మిటీని నియ‌మించ‌నున్న‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ ప్ర‌క‌టించారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: 

Union Budget 2022: ఈ ఏడాది నుంచి డిజిట‌ల్ క‌రెన్సీ

Budget 2022: 400 వందే భార‌త్ రైళ్లు..

Leave A Reply

Your email address will not be published.