నేడు కేంద్ర బడ్జెట్ 2025-2026
ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు తాత్కాలిక బడ్జెట్ లతో కలిపి మొత్తం ఏడు బడ్జెట్లు సమర్పించారు. ప్రస్తుతం ఎనిమిదవ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు.
బడ్జెట్ మఖ్యాంశాలు :
- వచ్చే ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లు
- 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి
- 2030 నాటికి నాలుగు చిన్న, మధ్యస్థాయి రియాక్టర్ల ఏర్పాటు
- రూ. 20 వేల కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జి మిషన్
- రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
- వృద్దులకు టిడిఎస్ ఊరట
- వడ్డీపై వచ్చే ఆదాయంపూ రూ.50వేల నుండి రూ. లక్షకు పెంపు
అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు - 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటి తొలగింపు
- దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
- పిఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు
- రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు
- 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
- మహిళలు, ఎస్ సి, ఎస్‌టి ఔత్సాహిత వ్యాపారవేత్తకు రూ.2 కోట్ల టర్మ్‌లోన్
- స్టార్టప్‌కలు ఇచ్చే రుణాలు రూ. 10 కోట్ల నుండి రూ.20 కోట్లకు పెంపు ఎంఎస్ ఎంఇ లకు రూ.5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు పెంపు