`స్వర్ణ భారత్ ట్రస్టు` వార్షికోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి అమిత్‌షా
నెల్లూరు(CLiC2NEWS): జిల్లాలోని వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి అమిత్ షా హాజరయ్యారు. ఈసందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారని కొనియాడారు. వెంకయ్య మాతృభూమిని ఎప్పడూ మర్చిపోలేదు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచించేవారు. `స్వర్ణభారత్ ట్రస్టు` ఆయన గొప్ప ఆలోచన. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన పరితపిస్తుంటారు. వెంకయ్యనాయుడు స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్నఅభిలాష నెరవేరిందని అన్నారు.