ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. కేంద్రమంత్రి అమిత్షా స్పందన
ఢిల్లీ (CLiC2NEWS): ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్లేని భారత్ దిశగా ఇది ఒక కీలక అడుగని, ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. సిఆర్పిఎఫ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ కు చెందిన భద్రతా బలగాలు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.
భద్రతా బలగాలు ఈ నెల 19 నుండి సుమారు వెయ్యి మందితో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. పలుమార్లు జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో పలువురు కీలక నేతలు ఉన్నారు.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి