ఉక్రెయిన్ నుండి భారతీయల తరలింపునకు వెళ్లనున్న కేంద్ర మంత్రులు..!
మోడి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. విద్యార్థుల తరలింపును సమన్వయం చేసేందుకు కొందరు కేంద్రమంత్రులు ఉక్రెయిన్ పొరుగుదేశాలకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఉక్రెయిన్‌కు వెళ్లే వారిలో హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు,, వీకె సింగ్ ఉన్నారని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరిట ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల్ని భారత్‌కు తీసుకువస్తుంది. ఇప్పటివరకు 2 వేలమంది విద్యార్థులు స్వదేశానికి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వారంతా బంకర్లు, బాంబ్ షెల్టర్లు, హాస్టళ్ల బెస్‌మెంట్ల కింద తలదాచుకున్నట్లు సమాచారం. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడం వలన భారత్‌కు వచ్చే వారి పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ చిక్కుకున్న విద్యార్థులు తమ పరిస్థితి వివరిస్తూ వీడియోలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తరలింపును సమన్వయం చేయడానికి కేంద్రమంత్రలు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లనున్నారని సమాచారం.