హైదరాబాద్ వచ్చిన సిఎం కెసిఆర్

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసినదే. బుధవారం ప్రధాని మోడి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో భేటి ఉండటంతో ఎసిఆర్‌కి అవకాశం లభించలేదు. సిఎంతో పాటు ఢిల్లీకి వెళ్లిన మంత్రలు కేంద్ర ఆహార పంపిణి వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంత సానుకూలత కనిపించినా ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ నెల 26వ తేదీన మరోసారి రావాలని కేంద్ర మంత్రులు సూచించారు. నవంబరు 29వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున మరికొన్ని రోజులు ప్రధానితో భేటీకి అవకావం లేదనే ఉద్దేశంలో సిఎం కెసిఆర్ తిరిగి వచ్చారని తెలుస్తుంది.