UP: బొలేరో బోల్తాపడి 11 మంది మృతి
గోండా (యుపి), (CLiC2NEWS): ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు … స్థానిక సిహాగావ్ గ్రామం నుంచి ఖర్గుపూర్‌లోని పృథ్వినాథ్ ఆలయానికి భక్తులను తీసుకెళ్లున్న బొలేరో వాహనం అదుపుతప్పి కాల్వలో బోల్లా పడింది. ప్రయాణ సమయంలో వాహనంలో డ్రైవర్ తో సహా 15 మంది ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఈ ఘటనలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల యుపి సిఎం యోగీ ఆదిత్యానాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తప్పక చదవండి: Coolie: తెలుగు ట్రైలర్ రిలీజ్
[…] UP: బొలేరో బోల్తాపడి 11 మంది మృతి […]
[…] UP: బొలేరో బోల్తాపడి 11 మంది మృతి […]