భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యుపి సిఎం ఆదిత్యనాథ్
హైదరాబాద్ (CLiC2NEWS): ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యుపి సిఎం పాతబస్తీలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి స్వయంగా హారతిచ్చారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు యోగి ఆదిత్యనాగ్ వెంట ఉన్నారు.