సర్కార్ బడుల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం!
లఖ్‌నవూ (CLiC2NEWS): జాబిల్లిపై చంద్రయాన్ -3 ల్యాండింగ్ ప్రక్రియను సర్కార్ బడుల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించాలని యుపి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.27 గంటల చంద్రయాన్ -3 జాబిల్లిపై అడుగుపెట్టనుంది. దీనిని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వెబ్‌సైట్, యూట్యాబ్ ఛానల్, డిడి నేషనల్ మాధ్యమాల ద్వారా ఆ దృశ్యాలను చూడవచ్చు. ఈ నేపథ్యంలో యుపి ప్రభుత్వం పాఠశాల్లో ఈ అపురూప దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.