UP: ఎన్నికల వేళ పార్టీల హామీల వర్షం..

లఖ్‌నవూ (CLiC2NEWS): ఎన్నిక సమయంలో అన్ని పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలను వెల్లడిస్తు న్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినదే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ రైతులకు హామీల వర్హం కురిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పంటకూ కనీస మద్ధతు ధర ఇవ్వడంతో పాటు ఉచిత నీటిపారుదల వసతులు సమకూర్చుతామని, చెరకు పండించే రైతులకు 15 రోజుల్లో బకాయిలు చెల్లించడ, రైతులకు వడ్డీలేని రుణాలు, బీమా, పింఛను సదుపాయాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు.
కేంద్రప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్మమించిన రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని తెలియజేశారు. ఉద్యమంలో భాగంగా ప్రాణాలు కోల్పోయన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేశారు.