రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి..
పశ్చిమ గోదావరి (CLiC2NEWS): జిల్లాలోని ఉండి మండలం చెరుకువాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జి ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఏలూరు నుండి భీమవరంకు కారులో బయలు దేరారు. అయితే వీరికి ఎదురుగా వస్తున్న వాహనం అదుపుతప్పి ఎమ్మెల్సీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్మెన్, పిఎ తీవ్రంగా గాయపడ్డారు. వారిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్ ఎల్సి మరణవార్తను విన్న సిఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.