UPSC: సివిల్స్(మెయిన్) పరీక్ష ఫలితాలు విడుదల
UPSC: యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యుపిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి, జులై 1న ఫలితాలు వెల్లడించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుండి 29 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేశారు. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదలైనట్లు సమాచారం.