యుపిఎస్‌సి సిఎస్ఇ- 2024 నోటిఫికేషన్

UPSC CSC-2024 : సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో చేరేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ () సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ () నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1056 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు ఆగస్టు 2024 నాటికి 21 నుండి 32 ఏళ్లు మధ్య ఉండాలి. సివిల్ సర్వీసెస్‌కు అర్హత సాధించాలంటే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు ఆరు సార్లు, ఒబిసి, దివ్యాంగులు తొమ్మిది సార్లు అటెంప్ట్ చేసే అవకాశం ఉంది ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ ప్రాథమిక పరీక్ష కేంద్రాలున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ పరీక్ష మే 26వ తేదీన నిర్వహిస్తారు.