యుపిఎస్‌సి సివిల్స్ 2025 నోటిఫికేషన్
UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హతతో అఖిల భారత సర్వీసులలో ఉద్యోగాలు 1129 పోస్టుల భర్తీ చేసేందుకు యుపిఎస్‌సి విడుదల చేసింది. 21 ఏళ్ల నుండి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100గా ఉండి. ఎస్‌సి, ఎస్టి, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు లేదు.
సివిల్ సర్వీసెస్ పోస్టులు (CSE) 979,
ఫారెస్ట్ సర్వీసెస్ పోస్టులు (IFS) 150
రాత పరీక్ష, (ప్రిలిమ్స్, మెయిన్స్) , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. CSE, IFS రెండిటికీ ఒకే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్ వేరువేరుగా జరుగుతాయి. ప్రిలిమినరి పరీక్ష మే 25న జరగనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 11 లోపు పంపించాల్సి ఉంది.
ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్ , వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి.
మెయిన్స్ పరీక్షా కేంద్రాలు: విజయవాడ , హైదరాబాద్.