UPSC న్యూఢిల్లీ.. ఐఇఎస్, ఐఎస్ఎస్ పోస్టులు

UPSC: ఇండియన్ ఎకానామిక్ సర్వీస్ (ఐఇఎస్), ఇండియన్ స్టాటికల్ సర్వీస్ (ఐఎస్ఎస్) ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఐఇఎస్ పోస్టులు
ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్ లో పోస్ట్ గ్రాడు్యేట్ డిగ్రీ అర్హత కలిగిన వారు ఐఇఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 12 పోస్టులు కలవు. అభ్యర్థల వయస్సు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఐఎస్ఎస్ పోస్టులు
డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ( స్టాటిటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిటిక్స్) అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 35 కలవు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.
రాత పరీక్ష , ఇంటర్వ్యూ/ పర్సనాలిటి టెస్ట్ ఆధారంగా పోస్టులకు ఎంపిక జరుగుతుంది. పరీక్ష ప్రారంభ తేదీ.. 20-06-2025.
దరఖాస్తులను మార్చి 4వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు రుసుం రూ. 200 గా నిర్ణయించారు. ఎస్‌టి, ఎస్‌సి, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల పూర్తి వివరాలకు https://www.upsc.gov.in వెబ్‌సైట్ చూడగలరు.