జర్నలిజంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు UPSC నోటిఫికేష‌న్ జారీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో 34 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్‌ డిగ్రీ లేదా జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌లో డిప్లోమా లేదా పీజీ డిప్లోమా ఉన్న వారిని అర్హులుగా ప్రకటించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించనున్నట్లు వెల్లడించింది.

  • ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో చూడవచ్చు.
  • ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 34

  • హిందీ- 9
  • తెలుగు- 5
  • మరాఠీ- 5
  • ఇంగ్లీష్- 3
  • పంజాబీ- 3
  • ఒడియా- 3
  • అస్సామీ- 2
  • మణిపూరి- 2
  • బెంగాలీ- 1
  • గుజరాతీ- 1

పోస్టులు: సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్

సంఖ్య: 34

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ లేదా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా

అనుభవం: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్‌పేపర్‌లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయస్సు: 30 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

వేతనం: ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.