రెండవ అధికార భాషగా ఉర్దూ .. ఎపి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అధికారిక భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ-2022 కు సంబంధించి మార్పులు వేంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి ఎపిలో 15 జిల్లాల్లో ఉర్దూ రెండవ అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. ఈ ఏడాది మార్చిలో ఎపి ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.