ఉక్రెయిన్‌కు బిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కారణంగా ఆదేశంలోని పలు నగరాలు ధ్వంసమయ్యాయి. సైనికులు, సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతున్నారు. అనేక మంది ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. ఉక్రెయిన్‌కు మానవతా సాయానికి ఒక బిలియన్ డాలర్ల ఆర్ధిక తోడ్పాటు అందించడంతోపాటు లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులను దేశంలోకి అనుమతించే ప్రణాళికను అమెరికా ప్రకటించనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. దీంతో పాటు ఉక్రెయన్, పొరుగు దేశాల్లో మీడియా స్వేచ్ఛ, మానవ హక్రులకు అండగా నిలిచేందుకు అగ్రరాజ్యం 320 మిలియన్ డాలర్ల నిధులతో యూరోపియన్ డెమొక్రటిక్ రెసెలియన్స్ ఇనిషియేటివ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.