యుఎస్‌లో గ‌డువు ముగిసినా అక్ర‌మంగా ఉండేవారిపై విచార‌ణ క‌మిటి

భార‌త్‌పై ఎఫెక్ట్ ఉంటుందా..?

USA: అగ్ర‌రాజ్యంలో వీసా గ‌డువు ముగిసినా అక్ర‌మంగా అక్క‌డే ఉంటున్న వారిపై హౌస్ క‌మిటి విచార‌ణ చేప‌ట్టింది. ట్రంప్ అధ్య‌క్షుడ‌యిన త‌ర్వాత లేవ‌నెత్తే ఒక్కో అంశంపై అక్క‌డ ఉండే వ‌ల‌స దారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ముందుగా వ‌ల‌స దారుల‌కు పుట్టే పిల్ల‌ల‌కు పౌర‌స‌త్వం..  తాజాగా విద్యార్థి, హెచ్‌-1 వీసాల‌ను క‌ఠిన‌త‌రం చేయ‌డం..    అమెరికాలో వ‌ల‌స చ‌ట్టాల అమ‌లును పునరుద్ద‌రించ‌డంపై విచార‌ణ క‌మిటి స‌భ్యులు ప‌లు సూచ‌న‌లు చేశారు.

బ్రెజిల్‌, కొలంబియా, ఇండియా, చైనా ఒక్కో దేశానికి చెందిన 2 వేల మందికి పైగా వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారు.  2023 వీసా గడువు ముగిసినా .. 7 వేల మంది భార‌తీయ విద్యార్థుల , ఎక్స్‌ఛేంజ్ విజిట‌ర్లు చాలాకాలం అమెరికాలోనే ఉండిపోయిన‌ట్లు స‌మాచారం. కనీసం 32 దేశాల‌కు చెందిన విద్యార్థులు, స్టూడెంట్ ఎక్‌ఛేంజి విజిట‌ర్లలో 20% పైగా వీసా గ‌డువు దాటినా యుఎస్ లోనే ఉంటున్నట్లు సెంట‌ర్ ఫ‌ర్ ఇమిగ్రేష‌న్ స్ట‌డీస్‌కు చెంద‌న జెస్సికా ఎం వాఘ‌న్ క‌మిటి దృష్టికి తెచ్చారు.

హెచ్‌-1బి వీసాల‌ను రెండేళ్ల గడువు మాత్ర‌మే ఉండాల‌ని .. వీటిని అవ‌సరాన్ని బట్టి నాలుగేళ్ల‌కు పొడిగించుకునేలా అవ‌కాశం ఇవ్వాల‌ని జెస్సికా పేర్కొన్నారు. వీరికి ఆటోమెటిక్‌గా పొడిగింపులు ల‌భించ‌కూడ‌ద‌ని సూచించారు. రిసెర్చి, నాన్ ప్రాఫిట్ స‌హ వీసాల సంఖ్య 75వేలు లోపే ఉండాల‌ని.. వీటిక‌న్నా ఎక్కువ ఉంటే వేత‌నాలు చెల్లించే సంస్థ‌కు కేటాయించాల‌న్నారు. ఇలా చేయ‌డం వ‌ల‌న ప్ర‌తిభ ఉన్న వారికి అవ‌కాశం ద‌క్కుతుంని.. అమెరికాలో ఉద్యోగుల‌కు కొద‌వ లేద‌ని ఆమె పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులుగా చాలా ప‌రిమిత సంఖ్య‌లో , ప్ర‌త్యేక ప‌రిస్తితుల్లో మాత్ర‌మే వీసాలు కేటాయించాల‌ని, ఒక్క స్టెమ్ డిగ్రీలు పూర్తి చేసి, ఆయా రంగాల్లో ప‌నిచేయ‌కుండా, ఉద్యోగాకు దూరంగా ఉన్న‌వారు 20ల‌క్ష‌లు పేగా ఉన్నార‌ని తెలిపారు.

 

ఎఫ్‌-1 వీసాలు అగ్ర‌రాజ్యంలో స్కూల్స్ , కాలేజ్‌లు, యూనివ‌ర్సిటిల్లో పూర్తిస్తాయి విద్యార్థిలా చ‌దువుకొనేందుకు  జారీ చేస్తారు. వీటిని

సెమినార్లు, భాష‌పై శిక్ష‌ణ‌ల‌కు కూడా వాడుతుంటారు.

 

ఎం-1 వీసాల‌ను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అక‌డ‌మిక్ అవ‌స‌రాల‌కు , లాంగ్వెజ్ ట్రైనింగ్‌ల‌కు వాడ‌తారు.

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.