జీవితంలో అత్యంత ఘోర కలి చూస్తాననుకోలేదు.. జోబైడెన్ ఆవేదన!

వాషింగ్టన్ (CLiC2NEWS): ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న దాడులలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ ఉగ్రవాదులు చిన్నారులు, మహిళలను అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. ఈ నేపథ్యంలో హమాస్ నరమేధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు చిన్నపిల్లలను అత్యంత పాశవికంగా చంపేస్తున్నారని.. ఇలాంటి ఘోర కలి చూడాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. హమాస్ మిలిటెంట్లు వందల మందిని బందీలుగా చేసుకొని వారిని అతి దారుణంగా చంపేశారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ () ప్రకటించిన నేపథ్యంలో జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిరు. మరోవైపు హమాస్‌కు మద్దతుగా నిలిచే ఇరాన్‌ను హెచ్చరించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేయెద్దని.. దీనికి దూరంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిపారు. యూదు ప్రజల భద్రతకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.